NLR: ప్రముఖ తెలుగు కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు గరిమెళ్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా సోమవారం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు చల్లా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన రాసిన గేయాలు సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్య్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని రగిలించాయన్నారు.