CTR: పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలోని గోగులమ్మ వంక వద్ద సోమవారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు. కల్లూరు నుంచి గంటావారిపల్లి వైపు వెళ్లే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్లూరు, పాతపేట, చల్లవారిపల్లె పంచాయతీ ప్రజలు రాత్రి పూట వ్యవసాయ పొలాల వద్ద బస చేయరాదన్నారు. తెల్లటి దుస్తులు ధరించి వెళ్లరాదని వెల్లడించారు.