VZM: తెర్లాం మండలం రంగప్పవలసలో సోమవారం సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణ పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పలుచోట్ల వీధిలైట్లు పాడైపోయాయని, వాటి స్థానంలో కొత్త లైట్లు వేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని, పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.