విశాఖ: దుఃఖవాణిపాలెం వంతెన వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్యాల కిషోర్ సుమారు 28 ఉద్యోగానికి తన అటోలో వస్తున్న సమయంలో అటుగా వచ్చిన లారీ ఢీకొనటంతో మృతి చెందాడు. మారికవలసలో యూజీడీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.