KDP: కదిరి నుంచి వేంపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదిరిలో బస్సు ఎక్కిన ఓ వ్యక్తి వేంపల్లికి టికెట్ తీసుకున్నాడు. వేంపల్లి సమీపానికి రాగానే కూర్చున్న చోటే ప్రయాణికుడు మృతిచెందాడు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.