NLR: పదో రెవెన్యూ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల ముగింపు సభ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మానసిక, శారీరక ఆరోగ్యానికి, అందరితో పరిచయాలు పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. క్యాంపు ఫైర్‌ను, నృత్యాలను ప్రదర్శించారు.