కర్నూలు జిల్లా పుటకలమర్రి ఏపీ మోడల్ స్కూల్‌ను ఎంపీ బస్తిపాటి నాగరాజు తనిఖీ చేశారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. బస్సు సౌకర్యం, ప్రహరీ గోడ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ప్రిన్సిపల్‌ను కోరారు.