అన్నమయ్య: శ్రీ సౌమ్య నాధుని కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం వేద పండితులు వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ దేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కళ్యాణం చూడ ముచ్చటగా సాగింది. కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులతో ఆలయంకిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణవేదికను అలంకరించారు.