CTR: పారదర్శక ఓటరు జాబితా రూపొందించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ఖచ్చితంగా ఉండేలా అన్ని దశల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అభ్యంతరాలపై వేగంగా స్పందించాలన్నారు. DRO మోహన్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.