MDK: శివంపేట మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సునీతా రెడ్డి రూ.20 లక్షల ఎన్.ఆర్.జీ.ఎస్. నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకురాలు అనితను అడిగి వివరాలు తెలుసుకున్నారు.