మయన్మార్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం క్రమంలో ఓ మఠంపై జరిగిన దాడిలో 23 మంది మృతి చెందారు. మయన్మార్ పాలకుల సైనిక జుంటా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది గాయపడినట్లు స్థానిక నివాసితులు తెలిపారు. కాగా, గత కొంతకాలంలో మయన్మార్లో అంతర్యుద్ధం కొనసాగుతోంది.