కోనసీమ: 2029 ఎన్నికల్లోనూ కూటమిదే అధికారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాజోలు మండలం తాటిపాకలో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా వారికి ఓటమి తప్పదన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, చీప్ ట్రిక్స్ వారికి అలవాటుగా మారాయని ఆరోపించారు.