ASR: స్వరాంధ్ర విజన్ 2047పై సమగ్ర ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్షిస్తారని తెలిపారు. అధికారులు జిల్లా విజన్ కార్యచరణ ప్రణాళికపై సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పర్యాటకం తదితర శాఖలపై మంత్రి సమీక్షిస్తారన్నారు.