NGKL : పదర మండలానికి చెందిన రమేశ్, రామాదేవి దంపతుల కుమార్తె నందిని అండర్-18 క్యాంపు విభాగంలో ఇండియా జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గురువారం తెలిపారు. ఈమె రాష్ట్ర స్థాయి అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అండర్-18 విభాగంలో TG జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది.