HYD: హైదర్ నగర్లో కల్తీ కల్లు ఘటనలో మరో బాధితుడు గురువారం ఆస్పత్రిలో చేరాడు. సత్యనారాయణ(52) అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అంబులెన్సులో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే హైదర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు మృతిచెందగా మరొకరు అస్వస్థతకు గురికావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.