ATP: నార్పల ఎస్సీ కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమం వివరించారు. గత ఐదేళ్లలో కుంటుపడ్డ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందన్నారు. పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు.