GNTR: షేక్.యాకోబ్ రాణి అనే మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో సోమవారం చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. ఆసుపత్రి వర్గాలకు తన నివాసం ఫిరంగిపురం గ్రామమని పేర్కొన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను గుర్తుపట్టే ఎవరైనా ఉంటే ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.