KMM: ఉమ్మడి జిల్లాలోని గిరిజన లంబాడాలు తమ తండాల్లో జరుపుకునే మొదటి పండుగ సీత్లా. ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటంటే.. ముఖ్యంగా బంజారా తెగలో, ప్రకృతిని, పశుసంపదను, పంటలను కాపాడే పకృతి దేవతైన సీత్లా మాతను పూజించే పండుగ. ఈ పండుగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగా పండాలని లంబాడాలు సీత్లా భవానిని కోరుకుంటారు.