VSP: బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి మరొక లారీ డ్రైవర్ మరణానికి కారణమైన కేసులో నిందితుడికి విశాఖ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎం. ప్రదీప్ కుమార్ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. గురువారం సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ ఈ వివరాలు తెలిపారు. అప్పలరాజుకు ఏడాది కఠిన జైలు శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించారు.