సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని 9వ సచివాలయాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక పరిశీలించిన ఆమె.. గైర్హాజరైన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరమని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు.