NLG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందని ద్రాక్షగానే తయారైంది. గత DEC మాసం నుంచి ఇప్పటివరకు వంట గ్యాస్ సబ్సిడీ వర్తించకపోవడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. మొదట్లో కొందరికి సబ్సిడీ డబ్బులు వచ్చినా.. 7 నెలలుగా జమ కావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.