TG: HYDలోని పహాడీషరిఫ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్లో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.