VZM: ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గుంటుబోయిన భవాని ఎన్నికయ్యారు. RMP వైద్యుల విస్తృత సమావేశంలో జిల్లా కార్యవర్గంలో మహిళల తరపున ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి చేతుల మీదుగా భవాని ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.