MNCL: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు జన్నారం మండల కేంద్రంలో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించబడునని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్ తెలిపారు. గురువారం జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఉ.10 గం.లకు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. అందరూ పాల్గొనాలన్నారు.