CM Jagan:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (jagan) కాలు (leg) బెణికింది. ఈ రోజు ఉదయం వ్యాయామం చేసే సమయంలో కాలు బెణికిందని (spraine) సీఎంవో ట్వీట్ చేసింది. సాయంత్రం వరకు నొప్పి ఎక్కువ అవడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటన రద్దు అయ్యింది.ఇదివరకు కూడా సీఎం జగన్ (jagan) కాలుకు గాయం అయ్యింది. దీంతో ఆయన చాలా రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరో కాలు బెణకడంతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం రేపు సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. అధికారులు అందుకు ఏర్పాట్లు చేశారు. కాలు బెణకడంతో పర్యటన రద్దు అయ్యింది. సీఎం జగన్ తరఫున మంత్రివర్గంలో ఒకరు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. వీలయినంత సమయం ప్రజలతో ఉండేట్టు చూసుకుంటున్నారు. మంత్రివర్గం, పార్టీలో ముఖ్య నేతలను కూడా సమన్వయ పరుస్తున్నారు. ఎక్కడ అసంతృప్తి లేకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. విపక్షాలు పాదయాత్ర చేయడంతో.. మరింత అప్రమత్తంగా జగన్ (jagan) వ్యవహరిస్తున్నారు.
ఇటు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇరుకున పడేలా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఓటు వేస్తే అంటూ నిన్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన నేతలు కూడా దురుసుతనం తగ్గించుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.