AKP: ఈనెల 31న కశింకోటలో జరిగే ఐద్వా జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు మాణిక్యం కోరారు. అచ్యుతాపురం 4 రోడ్ల కూడలిలో సోమవారం ఈ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అన్ని విధాలా ఆర్ధిక సహకారం అందించి ఆదుకోవాలన్నారు.