SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కుటుంబ సమేతంగా శనివారం దర్శించారు. స్వామి వారి ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు ఆలయాలను సందర్శించారు.