NRML: ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి భూక్య రమేష్ అన్నారు. ఆదివారం వారి మృతికి సంఘీభావం తెలుపుతూ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషిని కొనియాడారు.