NZB: గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈనెల 25న జరిగే రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 330 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.