AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్సీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం పార్టీని వీడారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. పార్టీపై ఉన్న అసంతృప్తితో ఆమె పార్టీని వీడినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటివరకు వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.