SKLM: తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న TTD వారు సకల మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇటీవల తన తల్లి మృతి చెందిన తర్వాత మొదటిసారిగా స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు.