VSP: సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులు అందజేసినట్టు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో చెంగలరావుపేటకు చెందిన సురాడ తమ్మయ్య, కోడి పంద్యాల వీధి బెవర పోలరాజు, మారుపల్లి అప్పన్న కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు.