KMM: యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. పెనుబల్లి మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎటువంటి కోతలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.