NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 10న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలు కావాలని డాక్టర్ శివరాం కోరారు.