జమ్మూ, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారత రైల్వే తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మూడు సెష్పల్ సర్వీసులు నడిపిస్తామని చెప్పింది. ప్రాంతీయ సమస్యల సమయంలో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది. అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులకు ఈ రైళ్లు సహకరిస్తాయని పేర్కొంది.