మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ఇవాళ ముంబైలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులు పాల్గొననున్నారు. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో నగరంలోని ప్రస్తుత భద్రతా పరిస్థితులపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే, శాంతిభద్రతలను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించనున్నారు.