PLD: అమరావతి మండలం లేమల్లె గ్రామంలో రాజధాని భూసేకరణపై బుధవారం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. భూసేకరణపై రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. అమరావతి మండల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.