PLD: ఎడ్లపాడులోని ఎన్ఎస్ఎల్ నూలుమిల్లులో చిలకలూరిపేట మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం జరిగింది. అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె. నరేందర్ రెడ్డి తెలిపారు. కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, బాల కార్మిక నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు.