PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరారు. మంజూరైన క్రిటికల్ కేర్ హాస్పిటల్‌ను త్వరగా పూర్తి చేయాలని, పేదల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.