KMM: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రఘునాధపాలెం మండల పరిధిలోని మంచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించారు. కూలీలకు రోజుకి రూ 600 ఇవ్వాలని అన్నారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్స్ అందజేశారు.