KKD: గొల్లప్రోలు శివారు పంట పొలాల మధ్యలోని చౌటు కాలువలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఎస్ఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విషయమై సచివాలయం-1 వీఆర్వో మంగతాయారు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు పరిశీలించగా కాలువలోని నీటిలో తేలుతూ కుళ్లిన స్థితిలో పురుషుడి మృతదేహం ఉందన్నారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.