NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు మండలాల్లో ప్రతిరోజూ సాయంత్రం వరకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అనంతరం ఆకాశంలో మబ్బులు ఏర్పడి ఒక్కసారిగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోవడం, మామిడికాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారు.