BHPL: రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లెపల్లి చంద్రమౌళి గుండెపోటుతో సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చంద్రమౌళి మృతదేహానికి పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు.