బాపట్ల: రేపల్లెలో సోమవారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. 5వ వార్డులో నివసించే సింగోటి కోటేశ్వరమ్మ అనే మహిళా ఉద్యోగి తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.