NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడం లేదని జలాశయ ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా జలాశయంలో 50.754 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 6వ క్రస్ట్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు 1000, దక్షిణ కాలువకు 30, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.