పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బేర్పారాకు చెందిన బాపన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు ఖాతూన్ ముక్కును కొరికేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన ముక్కు చాలా అందంగా ఉందని, అవకాశం దొరికితే దానిని కొరికి తినేస్తానని భర్త తరచూ అనేవాడని ఫిర్యాదులో పేర్కొంది. చివరకు అతను అన్నంత పని చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.