KMR:పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని వాడి గ్రామంలో వనదుర్గ పెద్దమ్మ కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.