NZB: ప్రతి ఒక్కరూ ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య విద్యార్థులకు సూచించారు. ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిదన్నారు. మనిషిని మనిషిగా గౌరవించాలని హితవు పలికారు.