KMR: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చల్లని ప్రదేశాల్లో ఉండాలన్నారు. బయటకు వెళ్తే టోపీ, తలపాగా వాడాలని సూచించారు. మజ్జిగ, గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.