AP: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంటుందని ప్రకటించారు.